Back to All Newstart Articles

పోషకాహారము

ఆదియందు … మనము మన పండ్లు కాయగూరలనే తింటిమి.

“దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్షమును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును” (ఆదికాండము 1:29).

అద్భుతమైన ఆరోగ్య సత్యము:

1483లో పుట్టిన థామస్ పార్ అనే వ్యక్తి 152 సంవత్సరాలు జీవించాడు అని చెప్పబడింది!

అదే నిజమైతే అతడు మొదటి ఎలిజబెత్ రాణి ఇంగ్లాండ్ను పాలించిన 50 సంవత్సరాలతో కలిపి 10 తరాల రాజ్యపాలనను చూసి ఉంటాడు.

1635లో, మొదటి చార్లెస్ రాజు థామస్ను తన కోటకు ఆహ్వానించి వృద్ధుడైన తనకు అంత సుదీర్ఘ జీవితం ఎలా సాధ్యమైందని అడిగాడు. దానికి జవాబుగా తాను సాధారణ రైతు జీవితం జీవించాననీ ఎక్కువగా బంగాళదుంపలు, పండ్లు, ముడిబియ్యము ఆహారముగా తినేవాడినని చెప్పాడు.

దురదృష్టకరంగా ఆ “వృద్ధుడైన పార్” ఆ రోజు తనకు వడ్డించబడిన రాజుగారి ఖరీదైన భోజనం తినలేకపోయాడు. ఆ రాత్రి భోజనం తరువాత అతడు జబ్బునపడి మరణించాడు. రాజైన చార్లెస్ తన ఖరీదైన భోజనంతో బ్రిటన్లోకెల్లా అతి వృద్ధుడైన? వ్యక్తిని చంపుకున్నానని చాలా బాదపడ్డాడు. అతన్ని ప్రముఖులు మాత్రమే సమాధి చేయబడే వెస్ట్ మినిస్టర్ అబ్బేలో సమాధి చేయించాడు. ఇప్పటికీ అతని సమాధి అక్కడ చూడొచ్చు?

ఇదంతా చూస్తోంటే బలమైన సుధీర్ఘమైన జీవితానికీ, మనము తినే ఆహారానికీ ఉన్న సంబంధానికి థామస్ జీవితము ఒక సజీవ నిదర్శనముగా కనిపిస్తోంది.

మానవాళి కొరకు దేవుడు నియమించిన మొట్టమొదటి ఆహారమేమిటి?

బైబిలు ప్రకారం సృష్టి అనంతరం ఆదాము అవ్వలకు ఆహారముగా పండ్లు, ధాన్యము, గింజలను తీసుకోమని దేవుడు ఆదేశించాడు. ఆకులు కూరగాయలను కూడా తినమని ఆయన ఆదేశించాడు : “పొలములోని పంట తిందువు” (ఆదికాండము 3:18). జలప్రళయము వరకు జీవించిన తరాలకు దేవుడు ఇచ్చిన మొట్టమొదటి ఆహారదినుసులు ఇవే.

జలప్రళయం తరువాత భూమిపై ప్రపంచవ్యాప్తంగా పంట సమూలముగా నాశనం చేయబడింది గనుక మొక్కలపై ఆధారితమైన ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం సాధ్యం కాదు. కాబటి ఆహారం విరివిగా అందుబాటులో ఉంచడానికి దేవుడు మాంసాహారాన్ని అనుమతించాడు. మరోప్రక్క పవిత్రమైన జంతువులనే ఆహారంగా ఇచ్చాడు (లేవియకాండము11; ద్వితీయోపదేశకాండము 14:3-21) అందుకే పవిత్ర జంతువులు రెండ్రెండుగా కాక ఏడేడుగా ఓడలోకివెళ్ళాయి.

మాంసాహారం ఆ సమయానికి తప్పనిసరి అయ్యింది కాని దానివల్ల మానవ ఆయుష్షు గణనీయంగా తగ్గిపోయింది. జలప్రళయానికి ముందు మానవ ఆయుష్షు దాదాపు 900 సంవత్సరాలు ఉండేది (ఆదికాండము 5వ అధ్యాయము). జలప్రళయం తరువాత నోవహు కుమారుడు షేము 600 సంవత్సరాలు జీవించాడు.

కేవలము తొమ్మిది తరాల మాత్రకాలం తరువాత అబ్రాహాము 175 సంవత్సరాలే బ్రతికాడు. ప్రస్తుత ఆయుష్షు జలప్రళయం ముందున్న మన పితరులతో పోలిస్తే చాలా తక్కువ! కానీ పండ్లు, కూరగాయలు, గింజలు, ధాన్యాలు, పొట్టు ఉన్న విత్తనాలతో కూడిన ఆహారము వారి ఆయుష్షును పొడిగించినప్పుడు, ఇప్పుడు మనము కూడా దాన్ని పాటిస్తే మన ఆయుష్షును కూడా పెంచదా?

అద్భుతమైన ఆరోగ్య సత్యము:

దేవుడు మాంసాహారాన్ని తినడాన్ని అనుమతించినప్పటికీ, ఇప్పటికీ ప్రాణాధారమైన మాంసాన్ని తినకూడదని ప్రజలను హెచ్చరించాడు (ఆదికాండము 9:4, లేవీయకాండము 3:17, 1 శామ్యూల్ 14:32-34). నిజానికి, ఆఫ్రికాలోని కొన్ని తెగలు, మాసాయి వంటి వారు తమ ఆహారంలో భాగంగా రక్తాన్ని తీసుకుంటారు. 50 మంది మసాయి పురుషులపై నిర్వహించిన శవపరీక్షలు విస్తృతమైన గుండె జబ్బులను చూపించాయి. వారి అత్యంత శారీరక జీవనశైలి కొంత రక్షణను అందించినప్పటికీ, వారు ఇప్పటికీ ఆధునిక ప్రపంచంలో అత్యంత అధ్వాన్నమైన ఆయుర్దాయం కలిగి ఉన్నారు (మహిళలకు 45 సంవత్సరాలు మరియు పురుషులకు 42 సంవత్సరాలు).

ఆహారము గొంతు దిగిన తరువాత ఏమి జరుగును?

సరైన ఆహారం సరైన జీర్ణశక్తితో మొదలౌతుంది. ఈ ప్రక్రియ ఆహారాన్ని నమలడంతో ప్రారంభమౌతుంది. కాబట్టి మీ ఆహారాన్ని బాగా నమలడం మొదలుపెట్టేలా చూసుకోండి. ఆహారం నోట్లో ఉండగానే (సలైవరి ఎమిలేస్) అనే లాలాజల రసాయన పదార్థం దాన్ని నలగగొట్టడం మొదలెడుతుంది.

గొంతు దిగిన ఆహారాన్ని ఆమాశయపాకం లేదా గుజ్జు అని వ్యవహరిస్తారు ఇక ఆ గుజ్జు గొంతు ద్వారా జారుకుంటూ కడుపులోకి చేరి అక్కడున్న ఆమ్లంలో కలిసి జీర్ణప్రక్రియకు లోనౌతుంది.

అది పూర్తయ్యాకా గుజ్జు చిన్నపేగుల్లోకి చేరి అక్కడున్న మరో రసాయనంతో కలిసి పిండి పదార్థాలను నలుగగొడుతుంది. అలాగే పిత్తాశయం నుండి పిత్తరసం వచ్చి ఆహారంలోని కొవ్వును జీర్ణం చేస్తుంది. క్లోమగ్రంథి (పేంక్రియాస్ గ్రంథి కూడా తన క్లోమ రసాయనాన్ని పంపి గుజ్జును మరింత నలుగగొడుతుంది. చిన్న ప్రేవులు ఆహారంలోని పోషకాలలో అధిక భాగాన్ని తీసుకొని గుజ్జును పెద్ద ప్రేవులలోకి పంపించేస్తాయి. ఈ దశలో జీర్ణక్రియ దాదాపు పూర్తవుతుంది … ఇక మిగతాది మనకందరికి తెలిసిన కథే.

అద్భుతమైన ఆరోగ్య సత్యము: మీరు తినడానికి ముందు జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మీరు నోరూరించే కమ్మటి వాసన చూసినప్పుడు లేదా మీకు ఇష్టమైన ఆహారాన్ని చూసినప్పుడు ఇది ప్రారంభమవుతుంది. జీర్ణక్రియ యొక్క మొత్తం ప్రక్రియ రాబోయే 29 గంటలు లేదా అంతకు పైగా కొనసాగుతుంది.

పోషకాహారము గురించి నీవు తెలుసుకోవలసినదేమిటి?

ఆహారంలో ప్రాథమికంగా ఐదు ముఖ్యమైన పదారాలు ఉంటాయి. అవి : పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు, శరీరానికి కావాల్సిన విటమిన్లు, మరియు ఖనిజాలు.

పిండిపదార్థాలు పిండి, చక్కెర, పీచు పదార్థాలకు మూలమైనవి. పిండి చక్కెర గ్లూకోజ్గా మారి శరీరానికి ముఖ్య ఇంధనంగా మారతాయి. ప్రధానంగా మొక్కల్లో దొరికే పీచుపదార్థం ఆహార పరిమాణాన్ని పెంచడంతో పాటు ప్రేవులను శుభ్రం చేస్తుంది.

మాంసకృత్తులు శరీరంలో బాగా నలిగి అమినో ఆమ్లాలుగా మారతాయి. ఇవి కండరాలు లాంటి శరీరభాగాల నిర్మాణములో ఇటుక రాళ్ళులా ఉండి, హార్మోన్లు, ఎంజైమ్లు, వివిధ అణువులను పట్టి ఒకటిగా ఉంచి వాటిని నిర్మిస్తాయి.

క్రొవ్వులు శక్తిని అత్యధికంగా కలిగి ఉండి మాంసకృత్తులు, పిండి పదార్ధాల కన్నా రెండంతల కేలరీలను ఎక్కువ ఉత్పన్నం చేస్తుంది. అంతేకాదు అవసరం వచ్చినప్పుడు వాడుకోవడానికి శక్తిని నిల్వ వుంచుతుంది. క్రొవ్వులో మూడు సహజరకాలు (1) ఒక్కదానిలోనే కరగనివి (2) అనేకవాటిలో కరగనివి (3) కరగనివి. కరగని కొవ్వు మిగిలిన వాటికన్నా చాలా ఆరోగ్యకరమైనది, ప్రత్యేకంగా మొక్కల నుండి వచ్చే కొవ్వు. శుద్ధిచేసిన కరిగే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం అనేక రోగాలకు కారణమౌతుంది.

శరీరానికి కావల్సిన విటమిన్లు, ఖనిజాలు ఇవి మన ఆహారంలో అతి ముఖ్యమైనవి. అధికంగా తక్కువగా మెరుగు చేయబడిన ముడి పదార్థాలలోసహజంగానే ఈ పోషకాలను అధికంగా ఉంటాయి. పైటోకెమికల్స్ మొక్కల్లో మాత్రమే లభిస్తాయి. ఇవి అనేక రోగాలను నివారించే లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటాయి.

మన ఆహారములో కొలస్ట్రాల్ (కొవ్వు) కాస్త అవసరము లేదంటారా?

కొలస్ట్రాల్ రకరకాలుగా మనకు లభిస్తుంది. అధిక సాంద్రతగల లైపోప్రోటీన్ (HDL) ఆరోగ్యకరమైన కొలస్ట్రాల్. ఇది చెడ్డ కొలస్ట్రాల్ను తొలగించి తిరిగి వాడుకోవడానికి తగినట్లు శుద్ధిచేయు నిమిత్తం కాలేయానికి పంపుతుంది. మంచి మరియు చెడు కొలస్ట్రాల్ను గుర్తించే పద్ధతి : HDL (అధిక సాంద్రతో కూడిన కొవ్వు) “ఆరోగ్యకరమైనది.” LDL (తక్కువ సాంద్రతో కూడిన కొవ్వు) హానికరమైనది VLDL (అతి తక్కువ సాంద్రతో కూడిన కొవ్వు) “అతి హానికరమైనది.”

కొలస్ట్రాల్ మాంసంలోనూ జంతు ఉత్పత్తులైన పాలు, గుడ్లు మొదలగు వాటిల్లో దొరుకుతుంది. ఈ కొలస్ట్రాలు కావలసింది కేవలం పసిపాపలకే. పాలుతాగే వయసు దాటినవారికి కావలసిన కొలస్ట్రాల్ను కాలేయమే ఉత్పత్తి చేస్తుంది కాబట్టి జంతు ఉత్పత్తులు పెద్దవారికి అవసరమే లేదు………..

మరింత చదవాలనుకుంటున్నారా? అమేజింగ్ హెల్త్ మ్యాగజైన్‌ను ఆర్డర్ చేయడానికి మా వనరుల పేజీని సందర్శించండి!