N.E.W.S.T.A.R.T

వ్యాయామము

ఆదియందు … జీవితము చురుకుగా ఉండెను.

“దేవుడైన యెహోవ నరుని తీసుకొని ఏదెను తోటను. సేధ్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను” (ఆదికాండము 2:15).

అద్భుతమైన ఆరోగ్య సత్యము:

విల్మా రుడోల్ఫ్ అనే అమ్మాయికి నాలుగేళ్ళ వయనులో పోలియో వ్యాధి సోకింది. దాని వల్ల ఒక కాలు చచ్చుబడిపోయింది. సహాయం లేకుండా నడవలేదని డాక్టర్లు చెప్పేసారు. కాని ఆమె ఆశవీడక తన కాలుకు తగిన వ్యాయామం ఇవ్వాలనుకుంది. తొమ్మిదేళ్ళు వచ్చేసరికి డాక్టర్లు ఆశ్చర్యపోయేలా కాలుకు వేసిన ఇనుపబద్దలు తీసివేసి నడువసాగింది.

13వ ఏట పరుగుపందాలలో పాల్గోనాలని అనుకుంది కాని ఆ మొదటి పందెంలో ఆఖరి స్థానంలో వచ్చింది. ఆ తర్వాత ప్రతి పోటీలో చివరి స్థానం లోనే వచ్చేది. ఇక పరిగెట్టడం ఆపేయమని అందరూ చెప్పేవారు కాని ఆమె పట్టువీడలేదు. ఒక రోజు ఒక పోటీలో నెగ్గింది… తర్వాత మరోటి నెగ్గింది. అలా పాల్గొన్న ప్రతి పోటీ నేగ్గసాగింది. చివరికి మూడు ఒలింపిక్ బంగారు వతకాలు గెలుచుకుంది.

విల్మా పోషణ లేని బక్కచిక్కిన జీవితాన్ని వదలి క్రియాశీల జీవితాన్ని ఎన్నుకొని విజేత అయ్యింది. అలాగే మన శరీరం కూడా ఓ అద్భుత యంత్రం కాని దాన్ని నీవు సరిగా వాడకపోతే దానిని కోల్పోతావు.

ఆదిలో అసలైన వ్యాయామ క్రమము ఎట్లుండేది?

ఆదాము ఏదెను వనంలో ఉన్నప్పుడు పరిపూర్ణ వ్యాయామ అలవాట్లు ఉండేవి (తోటపని నిజంగా శరీరమంతటికి సరిపడా వ్యాయామాన్ని ఇస్తుంది). పాపము ప్రవేశంతో పరిపూర్ణత చెదరి రోగం, మరణం, దాపరించాయి.

బైబిలు ప్రకారం మానవులు అసలైన వ్యాయామ క్రమం మారిపోయింది. ఒక వ్యాయామ సలహాదారు ఎలా మన పరిస్థితులు బట్టి వ్యాయామ క్రమాన్ని మారుస్తాడో అలాగే దేవుడు కూడా ఆదాము వ్యాయామ పద్దతిని మార్చాల్సి వచ్చింది. “నీ నిమిత్తము నేల శపింపబడియున్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నియు దాని పంట తిందువు … నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు” (ఆదికాండము 3:17, 19). ఇక ఆదాము పరిశ్రమ కఠినమైపోయింది కారణం అతడు ఇక “ప్రయాసపడాలి” చెమట “చిందించాలి.”

ఒకసారి ఈ వాక్యభాగాన్ని జాగ్రత్తగా గమనించండి : ఆదాము వ్యాయమ తీవ్రత పెంపు “నీ (అతని ) నిమిత్తం” జరిగింది. ఈ “ప్రయాస, చెమట” కసరత్తుల్లో ఇంకా ఏమైనా జీవదాయక మేళ్ళు ఉన్నాయా?

వ్యాయామము చేసేటప్పుడు శరీరములో ఏమి జరుగును?

మంచి ఆరోగ్యం కొరకు వ్యాయామం తప్పనిసరి. దానివల్ల శరీరమంతా ప్రభావితమౌతుంది. శరీర కండరాలు సంకోచించి వ్యాకొచిస్తాయి, గుండె రక్తాన్ని ఉదృతంగా పొంగిస్తుంది, ఊపిరి తిత్తులు మరి ఎక్కువ పనిచేసి శరీరానికి మరింత ఆక్సిజన్ (ప్రాణవాయువు) అందిస్తుంది. ఈ క్రియల వల్ల శరీర రసాయనాలు ప్రతి చర్యకు నాడీమండలం ఉత్తేజానికి, శరీర కణ నిర్మాణం బలోపేతానికి ఇంకా ఎన్నో జరుగుతాయి. వ్యాయామం ఒక ఆమోఘమైన ప్రక్రియ!

మంచి వ్యాయామము మనకెందుకు అవసరము?

వ్యాయామము ద్వారా లాభములు :

  • కేలరీలను ఖర్చు చేస్తుంది
  • బలాన్నీ, తట్టుకుని నిలిచే శక్తినీ వృద్ధి పొందిస్తుంది.
  • ఇంతకు ముందుకన్నా బాగున్నట్టుగానూ మరింత శక్తి వచ్చినట్లు అనిపిస్తుంది.
  • మరింత దీర్ఘకాలం బతకడంతో పాటు సంతోషంగా జీవించగలుగుతాము!

ఈ లక్ష్యాలన్ని వ్యాయామంపై ఉన్న ప్రాథమిక అవగాహనతో సాధించవచ్చును.

అతి శ్రేష్టమైన వ్యాయామ క్రమమేది?

కండరాల వ్యవస్థలో రెండు రకములు ఉండునని నీకు తెలియునా? అతి తక్కువ ఆక్సిజన్ తీసుకుంటూ చేసే వ్యాయామానికి ఉపయోగపడే కండరాలను “ఫాస్ట్ ట్విచ్” కండరాలు అంటారు. మీ బలాన్ని పెంచుకోవడానికి ఈ కండరాలకు పని పెట్టాలి. ఇంతకు ముందు అవి చేయని పనులకు వాటిని గురిచెయ్యాలి. అప్పుడు ఈ కండరాలు తమని తాము బలపర్చుకుని ఇంట్లో పనులు చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొనేలా సిద్దపడతాయి. వెయిట్ లిఫ్టింగ్ (బరువులు ఎత్తే క్రీడ) తర్ఫీదులో ఈ కండరాలే ఎక్కువగా ఉపయోగపడతాయి.

“స్లో ట్విచ్” కండరాలు ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటూ చేసే వ్యాయామాలకి ఉపయోగపడతాయి. ఇవి తట్టుకుని నిలిచే శక్తి కలిగి ఉంటాయి. ఈ కండలు పైకి పొంగవు గాని కేలరీలను ఖర్చు చేయడంలో ఇవే ముఖ్య పాత్ర పోషిస్తాయి.

మంచి శరీర ధారుడ్య తర్ఫీదులో ఈ రెండు రకాల కండరాలకు వ్యాయామం ఉండి తీరుతుంది. తట్టుకునే కండరాలూ శక్తి కండరాలూ కలిపి చేసే వ్యాయామ ప్రక్రియ శరీరంలో మార్పులను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. గుండె రక్త నాళ వ్యవస్థను బలపరచడం వంటి మరెన్నో మేళ్ళు చేస్తుంది!

గుండె ఆరోగ్యమును నేనెట్లు సాధించగలను?

మన గుండె వయసుకు తగ్గట్లు కొట్టుకునేలా – అంటే “హృదయ స్పందన లక్ష్య స్థాయి” చేరుకునేలా – చేసే వ్యాయామాలు గుండె ఆరోగ్యానికి శ్రేష్టమైన వ్యాయామాలు. నీ హృదయ స్పందన లక్ష్యం ఎంతుండాలో కింది ప్రక్రియ ద్వారా తెలుస్తుంది 220 – (నీ వయస్సు) 220లో నుండి మన వయస్సును తీసివేస్తే వచ్చే సంఖ్య నిమిషానికి నీ గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలనేది హృదయ స్పందన లక్ష్య స్థాయి.

ఉదాహరణకు ఒక 40 ఏళ్ళ వ్యక్తి హృదయ స్పందన లక్ష్య స్థాయి నిమిషానికి 180 సార్లు కొట్టుకోవాలి (220 – 40 = నిమిషానికి 180 సార్లు కొట్టుకోవాలి).

నీ గుండె మంచి ఆరోగ్యంతో ఉండాలంటే, ఆక్సిజన్ అధికంగా కావలసిన వ్యాయామం చేసేటప్పుడు నీ హృదయ స్పందన లక్ష్యంలో నీ నాడి స్పందన 50 నుండి 75% ఉంటే సరిపోతుంది.

అద్భుతమైన ఆరోగ్య సత్యము: కండరాన్ని వాడుకోండి, కాని తినకండి! మాంసం ఎర్రగా ఉంటుంది ఎందుకంటే అది రెండో రకం కండరం. దానికి ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తం అవసరం. ఇలాంటి ఎర్రని మాంసం తింటుంటే గుండె రక్తనాళ వ్యాధులూ పెద్దపేగు కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువని అధ్యయనాలు చూపుతున్నాయి.

హృదయ స్పందన రేటు లక్ష్యము తికమకగా ఉన్నదా?

దాని గురించి మాట్లాడుకుందాము …మీ హృదయ స్పందన, నాడీ స్పందనల్ని లెక్కపెట్టడం ఇబ్బందిగా ఉందా? అయితే సాంప్రదాయ పద్ధతిని అనుసరించండి. వ్యాయామం చేస్తూ మామూలుగా మాట్లాడగలుగుతూ ఉంటే హృదయ స్పందన లక్ష్యంలో ఉన్నారు. పాటలు పాడుతూ వ్యాయామం చేయగలిగితే తగిన వ్యాయామం చేయడం లేదని, ఆయాసంగా ఉండి మాట మాటకి గుక్క కోసం ఆగుతుంటే మీరు అతిగా వ్యాయామం చేస్తున్నట్టు ఈ పద్ధతి నడక………

మరింత చదవాలనుకుంటున్నారా? అమేజింగ్ హెల్త్ మ్యాగజైన్‌ను ఆర్డర్ చేయడానికి మా వనరుల పేజీని సందర్శించండి!