
N.E.W.S.T.A.R.T.
స్వచ్చమైన నీరు

ఆదిలో… నీరు అంతటా ఉండేది.
“ఆ తోటను తడుపుటకు ఏదెనులోనుండి ఒక నది బయలుదేరి అక్కడనుండి చీలిపోయి నాలుగు శాఖలాయెను” (ఆదికాండము 2:10).
అద్భుతమైన ఆరోగ్య సత్యము:
సుమారు 100 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలో ఇసుకతిన్నెల మీద ఎముకల కుప్ప కనబడింది. ఎడారిలో తప్పిపోయిన ఓ వ్యక్తి చనిపోయుంటాడు. చిరిగిన అతని బట్టలజేబుల్లో వ్రాసిన కాగితంపై, “దాహంతో చనిపోతున్నా ఇక ముందుకు వెళ్ళలేను,” అని ఉంది. బహుశా ఓ చిన్న తాత్కాలిక గూడుకట్టుకుని దాహంతో చనిపోయేవరకు అతడు అక్కడే కూర్చుండిపోయి ఉంటాడు. దురదృష్టవశాత్తు, అతని అవశేషాలు ఓ పచ్చని ఒయాసిస్సు దగ్గరలో ఇసుకదిబ్బల ఆవల ఉంది – ఉబుకుతున్న ఊటకు కొన్నివందల గజాల దూరంలో అతను దాహంతో చనిపోయాడు.
ఈ రోజుల్లో కూడా ఇలాగే, లక్షలాది మందికి చాలా ముఖ్యమైన, ప్రాథమికమైన నీరు భూమిపై సమృద్ధిగా దొరుకుతున్నా, ఈ నీటి కొరతతో నెమ్మదిగా చనిపోతున్నారు!
దేవుడు ముందే ప్రణాళిక వేశాడా?
“అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు ఏలయనగా దేవుడైన యెహెూవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడులేడు దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను” (ఆదికాండము 2:5-7).
మొక్కలూ జంతువులూ మానవజాతి ఎన్నడూ దాహాన్ని ఎరగకముందే, దేవుడు పుష్కళంగా నీటిని సృష్టించి వారి అవసరాన్ని ముందే తీర్చాడని బైబిలు చెబుతోంది. దాహం కోసం దేవుడు చేసిన ప్రణాళిక ఇప్పటికీ అలాగే వర్తిస్తూ ఉందా? మనకు ప్రాణాధారమైన నీళ్ళ లక్షణాలను, మనకు బాగా అలుసైపోయిన పదార్థమును మళ్ళీ పరిశీలిద్దాం …
మన శరీరంలో ఎంత నీరు ఉంటుంది?
బృహద్దము (మనశరీరంలో అతిపెద్ద రక్తనాళం) నుండి జైగోమా (పుర్రెలో ఎముక) వరకు శరీరం బరువులో కొలిస్తే 60% పైగా నీరే ఉంటుంది. అదనంగా కొన్ని కణాలు, అవయవాలు మరి అధిక నీటి సాంద్రత కలిగి ఉంటాయి. మెదడు 70%, ఊపిరితిత్తులు 90% వరకు నీటితో నిండి ఉంటాయి! మన శరీరాల వెలుపల శుభ్రం చేయడానికి మాత్రమే నీటిని ఉపయోగించము కానీ లోపలి భాగంలో, సూక్ష్మావయవ స్థాయిలోకూడా, నీటిని “సర్వ శుద్ధీకరణ” కారిగా పరిగణిస్తారు.
అనేక మిశ్రమ రసాయనాలు నీళ్ళలో కరిగిపోయి ద్రావకంగా రూపొందుతాయి. ఉదాహరణకు, రక్తంలో సుమారు 83% నీరుంటుంది. మిగిలింది రక్తకణాలు, పోషకాలు, హార్మోన్లు మొదలైనవి ఉంటాయి.
తగినంత నీరు లేకపోతే, మనరక్తం చిక్కనౌతుంది. అలా ఐతే ఏమౌతుందో మీకు చూపించాలంటే : నారింజ జూసుతో వంటగిన్నెలు కడిగా మనుకోండి, మొత్తం జిగురుమయమే కదా!
తగినంత నీరు మనలో లేనప్పుడు మన శరీరానికి ఏమి జరుగుతుంది?
మన శరీరంలో ముఖ్య అవయవాలకు చాలినంత నీరు లేనప్పుడు వాటిని రక్షించడానికి ఒక క్లిష్టమైన రక్షణయంత్రాంగాన్ని శరీరం కలిగి ఉంటుంది. తక్కువ ప్రాధాన్యమున్న భాగాలనుండి (చర్మం, కీళ్ళు, ఎముకలు మొదలైనవి) నీటిని తీసుకొని మెదడు, గుండె ఇతర ముఖ్య అవయవాలకు ఇస్తుంది.
దురదృష్టవశాత్తు చాలామంది తమ జీవితాంతం పాక్షికంగా ఈ నిర్జలీకరణ స్థితిలో(డీహైడ్రేషన్) జీవిస్తున్నారు – ఫలితంగా అకాల వృద్ధాప్యం, మూత్రపిండాలు, ఆర్థరైటిస్ లాంటి ఇతర ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్నారు.
నిజముగా మనకు ఎంత నీరు అవసరము?
దాహం వేసేవరకూ ఆగకుండా క్రమంతప్పక నీరుత్రాగటం చాలాముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫార్సు ప్రకారం సాధారణ పర్యావరణ పరిస్థితుల్లో ఏ పని చేయకుండా ఊరకనే ఉన్నప్పుడు ఈ క్రింది విధంగా రోజూ నీరుతీసుకోవడం మంచిది :
ఆడవారు : సుమారు 9 పావు లీటరు గ్లాసుల నీరు (9 ఎనిమిది ఔన్స్ గ్లాసులు)
మగవారు : సుమారు 12 పావు లీటరు గ్లాసుల నీరు (12 ఎనిమిది ఔన్స్ గ్లాసులు)
రోజుకు సగటున శరీరంలోని నీరు 4 శాతం పోతుంది. మూత్రం, ప్రేగుల కదలికలు, చెమట, శ్వాసల ద్వారా కూడా నీరు పోతుంది. వాస్తవానికి, వ్యాయామం చేసేటప్పుడు అధికచెమట, ఆయాసం వచ్చి ఇంతకంటే కొంచెం ఎక్కువ నీరు తీసుకోవడం అవసరమౌతుంది, ఎందుకనగా మన భారతదేశంలో కష్టపడి పనిచేసేవారు ఎక్కువ.
సరిగ్గా దాహము వేసినప్పుడు మనము ఎందుకు నీరు తాగలేకపోతున్నాము?
దాహంవేసే వరకు నీవు నీరు త్రాగడం లేదా? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏదైనా తాగమని నీ మెదడు నీకు చాలా సేపటి వరకు చెప్పట్లేదంటే నీవు బహుశా నీటిలోపముతో బాధపడుతూ ఉండవచ్చును.
నీటిలోపము ప్రారంభ లక్షణాల్లో కొన్నేమిటి?
స్వల్ప నీటిలోపం అంటే శరీరబరువులో 1 నుండి 3% తగ్గిపోయి ఈ లక్షణాలు కనిపిస్తాయి :
- తలనొప్పి
- అలసట,
- గందరగోళం,
- ఆకలిలేకపోవడం,
- చర్మం ఎర్రబారిపోవటం
- వేడిని తట్టుకోలేకపోవడం,
- తల తిరగడం,
- నోరు, కళ్ళు పొడిబారిపోవడం,
- చర్మం పెళుసుబారటం,
- కడుపునొప్పులు, (వీటిని సాధారణంగా ఆకలి వేయడమని భ్రమపడతారు),
- త్వరగా జీర్ణమవ్వకపోవడం (ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది).
అద్భుతమైన ఆరోగ్య సత్యము: సాధారణ నీటి వడపోత, రివర్స్ ఆస్మోసిస్ (ఆవిరి ద్వారా శుద్ధీకరణ) మొదలైనవి నీటిని శుద్ధిచేయడానికి వాణిజ్య సరఫరాదారులు ఉపయోగించే కొన్ని పద్ధతులు. కొందరు రుచిని మెరుగుపరచడానికి ఖనిజాలను కూడా కలుపుతారు. నీ త్రాగునీటి రుచిని పెంచడానికి ఒక మార్గం తాజా నిమ్మరసం కలపడం.
నిర్జలీకరణ లేక నీటిలోపము (డీహైడ్రేషన్) ప్రమాదకరముగా మారే అవకాశమున్నదా?
కచ్చితంగా చూసుకోకపోతే, ఈ లక్షణాలు మరి దిగజారి తరువాత వేడి, అలసటకు దారితీసి వికారం వాంతుల్లోకి దించుతాయి. ఇది నిర్జలీకరణాన్ని మరి దిగజార్చి ఊహించని వేగంతో చెయ్యి దాటిపోయేలా చేస్తుంది. తీవ్ర నిర్జలీకరణము ప్రాణాంతకం!
మరింత చదవాలనుకుంటున్నారా? అమేజింగ్ హెల్త్ మ్యాగజైన్‌ను ఆర్డర్ చేయడానికి మా వనరుల పేజీని సందర్శించండి!