N.E.W.S.T.A.R.T.

మితానుభావము

ఆదియందు … ఏది ఎంచుకోవాలో అనేది స్పష్టంగా ఉంది (ఎంపిక చేసుకునే స్వతంత్రము ).

“మరియు దేపుడైన యెహోవా … ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిన దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.” (ఆదికాండము 2:16, 17).

అద్భుతమైన ఆరోగ్య సత్యములు:

జెల్లీ ఫిష్ లాంటి కొన్ని సముద్ర జంతువులు చిత్రంగానూ భ్రమలా, భయపెట్టేవిగాను ఉంటాయి. ఈ వికారమైన జిగురులాంటి జీవులు 97% నీటితో చాలా పారదర్శకంగా ఉంటాయి, అందుకే దీనికి “జెల్లీ ఫిష్” అని పేరు.

అసలు వాటి ఉనికే ఆశ్చర్యం. వాటికి గుండె, రక్తం, మొప్పలు, ఎముకలు, మృదులాస్థి ఉండవు. కొన్ని జెల్లీలకు కాంతిని గుర్తించగల కళ్ళు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు కాని వాటికి మెదడు లేదని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంది !

జెల్లీ ఫిష్ గంటలాంటి ప్రత్యేక కండరాలను ఉపయోగించి నీటిని పీల్చుకొని వదలడం ద్వారా పైకి కిందకి కదులుతుంది. అయితే వాటి కదలికపై వాటికి నియంత్రణ లేదు. గాలి నీరు వాటిని ఏలా కదిలిస్తే అలా నడుస్తాయన్నమాట.

కానీ జెల్లీ ఫిష్ మాదిరిగా కాకుండా, దేవుడు మనిషికి మెదడు, స్వయం నిర్ణయ శక్తిని ఇచ్చాడు.

దేవుడు తాను చెప్పిన దానికి నిజముగా కట్టుబడి ఉంటాడా?

ఆదిలో దేవుడు ఆదాము హవ్వలకు జీవవృక్ష ఫలంతో పాటు తోటలోని ఇతర పండ్లను తినడానికి స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ ఒక చెట్టు పండును తిన్నా తాకినా మరణానికి దారితీస్తుందని హెచ్చరించాడు. మంచి చెడుల జ్ఞానమిచ్చు చెట్టు తోట మధ్యలో విధేయతా అవిధేయతల మధ్య ఎంపికగా నిలిచింది. పాపం, ఈ మొదటి మానవులు ఈ ప్రమాదకర పండు వారి ఆహారానికీ జ్ఞానానికీ మంచిదిగా ఉంటుందని అనుకున్నారు. వారు దేవుని స్పష్టమైన ఆదేశానికి వ్యతిరేకంగా వెళ్ళారు. ఒక్క కొరుకుడుతో పాపమూ, హృదయ వేధనల సునామీ ఈ ప్రపంచం అంతటా వ్యాపించింది. ఇక ఈ తినకూడని చెట్టు లోకంలో లేనప్పటికీ, మన ఆనందాన్ని పోగొట్టి మన స్వేచ్ఛను దోచుకునే ఇతర “తినకూడని పండ్లు” నేడు ఉన్నాయా?

అద్భుతమైన ఆరోగ్య సత్యము: బైబిలు ప్రకారం, మనిషి పాపాన్ని ఎంచుకున్నాడు కాబట్టి అది లోకంలోకి ప్రవేశించింది. నిజమే, పాపానికి బైబిలు నిర్వచనం దేవుని ఆజ్ఞను అతిక్రమించడం (1 యోహాను 3:4). ఇది మనిషి పండు తిన్నందువల్ల రాలేదు – దేవుని మాట, మంచితనానికి వ్యతిరేకంగా చేసిన నిర్ణయం వల్ల వచ్చింది.

ఫ్రంటల్ లోబ్ (నుదుటి లోపల మెదడులో లలాట ఖండము)

1848 సెప్టెంబరులో, రైలుపట్టాల ఫోర్ మాన్ అయిన 25 ఏళ్ల ఫినియాస్ పి. గేజ్, ఇనుప చువ్వను ఉపయోగించి పేలుడు పొడిని రంధ్రంలోకి కూరుతుండగా, ఒక శక్తివంతమైన పేలుడు జరిగి 13-పౌండ్ల ఇనపముక్క అతని తలపై బుల్లెట్లాగ తగిలింది. ఆశ్చర్యకరంగా, ఫినియాస్ చనిపోలేదు. వాస్తవానికి, తన శరీర బలాన్ని తిరిగి పొంది మరో 13 సంవత్సరాలు జీవించాడు. అతను మానసికంగా కూడా బాగానే ఉండేవాడు – మునుపటిలాగే మాట్లాడేవాడు శారీరక పనులు చేయగలిగేవాడు కాని అతని జ్ఞాపకశక్తి బలహీనంగా ఉండేది.

అయితే అతను మునుపటి వ్యక్తి కాదని స్నేహితులుకూ కుటుంబసభ్యులకూ అర్థమైంది. ప్రమాదానికి ముందు బాధ్యతగల కార్మికుడనీ భర్తనీ, భక్తిగల నమ్మదగిన వ్యక్తనీ అందరూ పిలిచేవారు. కానీ ప్రమాదం తరువాత, ఫినియాస్ నైతికంగా చాలా పతనమైయ్యాడు. అతను చాలా ముక్కోపిగా, మొరటుగా, దురుసుగా మాట్లాడేవాడు. పొగతాగటం, మద్యపానం మొదలు పెట్టి భక్తి గౌరవాలను వదిలేసాడు. అతడు నైతిక విలువలపై పట్టుకోల్పోయినట్లు అనిపించింది.

ఫినియాస్ ప్రమాదం అతని నైతిక ప్రమాణాలనూ నిబద్ధతనూ కూల్చేసింది. నైతిక ఆలోచనకూ సమన్యాయానికీ, సామాజిక ప్రవర్తనకూ ఆధ్యాత్మికతకూ కారణమైన మెదడులోని ఒక ముఖ్య భాగాన్ని (ఫ్రంటల్ లోట్ ని) అతను కోల్పోయాడని పరిశోధకులు నిర్ధారించారు. ఆశ్చర్యకరంగా, జీవన్మరణాల మధ్య వ్యత్యాసాన్ని సూచించే ముద్రను మన నుదిటిపై సాతాను వేయడం గురించి బైబిల్ మాట్లాడుతోంది!

నిర్ణయాలు నిజముగా ఎక్కడ తీసుకోబడతాయి?

మెదడులోని ఫ్రంటల్ లోబ్ మన హేతుబద్ధతకూ నీతికీ, నైతిక నిర్ణయాలకూ కీలకం. మన గుణగణాలనూ వ్యక్తిత్వాన్నీ, చిత్తాన్నీ నిర్వచించేది మెదడులోని ఈ భాగమే. ఈ ఫ్రంటల్ లోబే మన ఆధ్యాత్మిక నైజానికి మూలం. ఈ కారణంగా, మెదడులోని ఈ భాగాన్ని నాశనం చేయడానికీ మసకబార్చడానికీ సాతాను నిరంతరం ప్రయత్నిస్తూ ఉన్నాడు.

అద్భుతమైన ఆరోగ్య సత్యము: “లోబోటోమి” అనేది శస్త్రచికిత్సను సూచించే పదం. ఇది ఫ్రంటల్ లోబ్ పనితీరును నాశనం చేస్తుంది. 1900ల ఆరంభంలో స్కిజోఫేనియా, విపరీత నిరాశా, మానసిక రుగ్మతలు వంటి మానసిక రోగాలకు చికిత్స చేయడంలో ఈ విధానం బాగా పేరొందింది. ఇది చిన్నపిల్లల అవిధేయత కేసుల్లో కూడా ఉపయోగించేవారని తెలుస్తోంది! ఏదేమైనా, ఈ తిరుగులేని విధానం వల్ల పిల్లల వ్యక్తిత్వాన్ని, హేతుబద్ధతనూ, స్వేచ్ఛనూ దోచుకుంటూనే ఉంది.

ఫ్రంటల్ లోబ్ సరిగ్గా పనిచేయనప్పుడు ఏమి జరుగుతుంది?

ఫ్రంటల్ లోబ్ దెబ్బతినడాన్ని స్కిజోఫేనియా, బైపోలార్ డిజార్డర్ (విరుద్ద ద్వంద వైఖరి), అబ్సెసివ్-కంపల్సివ్ డిజార్డర్, డిప్రెషన్ లాంటి అనేక మానసిక రోగాలతో నిపుణులు ముడిపెట్టారు. ఫ్రంటల్ లోబ్ సమస్యల్లో కొన్ని:

 

  • నీతి నియమాలు దెబ్బతినడం,
  • సామాజిక రుగ్మత,
  • దూరదృష్టి లేకపోవడం,
  • సిద్ధాంత పరమైన తార్కికతను కోల్పోవడం,
  • గణితంలో సామర్థ్యం తగ్గిపోవడం,
  • అదుపు లేకపోవడం (గొప్పలుపోవడం, విరోధం, దూకుడు),
  • జ్ఞాపకశక్తిని కోల్పోవడం (ముఖ్యంగా అప్పటికప్పుడే మర్చిపోవడం),
  • ఏకాగ్రత కోల్పోవడం, కుదురులేకపోవడం,
  • భావోద్వేగ అస్థిరత,
  • నిశ్చింతగా లేకపోవడం, (ఆసక్తి చూపలేకపోవడం).
  • ఎవరి పరిస్థితినీ పట్టించుకోకపోవడం సరదాగా లేకపోవడం).

ఫ్రంటల్ లోబ్ దెబ్బతినడానికి సాధారణ కారణాలేమి?

ఫ్రంటల్ లోబ్ తీవ్రంగా దేబ్బతినడంలో కొన్ని కారు ప్రమదాలాంటి భయంకర సంఘటనల వల్ల జరుగుతాయి. వింత ఏమంటే ప్రమాదం కన్నా అనారోగ్య జీవనశైలి వల్లే అధికంగా ఫ్రంటల్……….

మరింత చదవాలనుకుంటున్నారా? అమేజింగ్ హెల్త్ మ్యాగజైన్‌ను ఆర్డర్ చేయడానికి మా వనరుల పేజీని సందర్శించండి!