N.E.W.S.T.A.R.T

పరిశుభ్రమైన గాలి

ఆదియందు … జీవవాయువు (జీవాన్నిచ్చే గాలి) జీవాన్నిచ్చెను.

     “దేవుడైన యెహెూవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను” (ఆదికాండము 2:7).

అద్భుతమైన ఆరోగ్య సత్యము: గత శతాబ్దంలో మానవుడు కొన్ని గడ్డు వాతావరణాలను జయించాడు లోతైన మహాసముద్రాలను అన్వేషించాడు, ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు. అంతరిక్షంలోకి అడుగుపెట్టాడు. ఈ విజయాలు సాధించే ముందు ఒక సాధారణ సవాలును అధిగమించవలసివచ్చింది : ఊపిరి తీసుకోవడానికి తమ గాలిని వారితో ఎలా తీసుకెళ్లాలో నేర్చుకోవలసి వచ్చింది.

జీవవాయువు ఊదగా జీవాత్మ ఆయెను

బైబిలు సృష్టి క్రమాన్ని దగ్గరగా చూస్తే, మానవాళి సృష్టిలో చాలా ప్రత్యేకతను మీరు గమనించవచ్చు. ఆయన తన చేతులతో ఆదామును నిర్మించి తన “జీవవాయువు”ను ఆదాము ఊపిరితిత్తులలోకి ఊదాడు. “జీవవాయువు” మన ఉనికికి మొదలైతే, ఆ శ్వాస లేకపోతే జీవం ఉండదు అనుకోవడంలో తప్పేమిలేదు కదా!

      మీరు చూస్తున్నట్టుగా, మీరు పీల్చుకునే ఊపిరి, ఎంత బాగా పీల్చుకుంటున్నారో అనేది మీరు నిజంగా ఎంతకాలం జీవిస్తారనే దానిపై చాలా ప్రభావం చూపుతుంది : ఇది “జీవితానికి జీవితపరిమళం” కావచ్చు లేదా “మరణానికి మరణం” కూడా కావచ్చు (2 కొరింథీయులకు 2:16). ఓ సారి లోతైన శ్వాసతీసుకోండి … ఇక చదువుకోండి!

గాలి ఎందుకంత గంభీర అంశము?

ఆక్సిజన్ మన శరీరానికి చాలా ముఖ్య భౌతిక అవసరం. గాలిలో 20% మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది, కాబట్టి ప్రతి శ్వాస ఈ జీవ వాయువును ఊపిరితిత్తులలో నింపుతుంది. అప్పుడు ఆక్సిజన్ రక్తప్రవాహంలోకి ప్రసరించి మీ ఎర్ర రక్త కణాల ద్వారా శరీరమంతా రవాణా ఔతుంది. శరీర ప్రధాన శక్తి వనరు అయిన గ్లూకోజుతో కూడి ప్రతిచర్యలను సులభతరం చేయడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ లేకుండా ఈ శక్తి వనరు ఎందుకూ పనికిరాదు

లోలోపల అగ్ని

       గ్లూకోజ్ ఆక్సిజన్ల మధ్య ప్రతిచర్యను వెలుగుతున్న కొవ్వొత్తితో పోల్చవచ్చు. ఆక్సిజన్ స్థాయి తగ్గితే కొవ్వొత్తి “ఆరిపోతుంది.” అదే విధంగా, మీ శరీరంలో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటే, మీ “దీపం ఆరిపోతుంది” (స్పృహ కోల్పోతారు). ఆరిన కొవ్వొత్తి లాగే మీ శరీరం కూడా పొగలు చిమ్ముతుంది. ఈ పొగ మీకు కనబడదు కానీ ఊపిరి వదిలిన ప్రతిసారీ, కార్బన్ డయాక్సైడ్, నీటి ఆవిరి గాలిలోకి విడుదలౌతాయి.

ప్రతికూలత (నెగిటివ్) సానుకూలత (పాజిటివ్) అవ్వడం ఎలా సాధ్యము?

      “తాజా” గాలిని పీల్చడం ద్వారా ఆరోగ్యం నిజంగా మెరుగుపడుతుంది. మీరు ఎప్పుడైనా ఉరుముల పర్షం తర్వాత గానీ సముద్రపు ఒడ్డున కాని నడక కోసం వెళ్ళారా? మీకు ఉత్తేజకరంగా అనిపించిందా? నెగిటివ్ అయాన్లతో కూడిన గాలిలో ఊపిరి పీల్చుకోవడం వల్ల అహ్లాదంగా అనిపిస్తుంది. ఇవి సహజంగా రేడియేషన్ ఉన్న బహిరంగ ప్రదేశాల్లో (అంటే సూర్యరశ్మి, అడవులు, పర్వతాలు, అల్లకల్లోలమైన నీరు, ఉరుముల వర్షం తర్వాత) కనిపిస్తాయి.

బాగా ఊపిరి పీల్చుకోవడానికి నీవేదైనా చేయగలవా?

అదృష్టవశాత్తూ, శ్వాస అనేది సహజమైనది, కానీ శ్వాసలో చాలా మందికి చెడు అలవాట్లు ఉన్నందున ఊపిరితిత్తులను సమర్ధంగా ఉపయోగించుకోరు. అసలు, శ్వాస అనేది డయాఫ్రంను. (ఉదర అవయవాలను ఊపిరితిత్తులను వేరుచేసే కండరం) కిందకునెట్టడం ద్వారా ఊపిరితిత్తులను విస్తరించేలా చేస్తుంది. ఉచ్ఛ్వాస సమయంలో ఉదర కండరాలను సడలించడం ద్వారా దీనిని సాధించవచ్చు. మీ ఊపిరితిత్తుల ఎగువ, దిగువ భాగాలను సమంగా విస్తరించి “గట్టి శ్వాస” తో మరి సమర్ధంగా ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడులను మార్చి మార్చి తీసుకొంటూ ఊపిరితిత్తులను పూర్తి పరిమితితో వాడుకోవాలి. వాస్తవానికి, శ్వాస గట్టిగా తీసుకొనే సాధనతో కొన్ని రకాల న్యుమోనియాలను నివారించడం చక్కని పద్ధతుల్లో ఒకటి.

అద్భుతమైన ఆరోగ్య సత్యము:  మీ ఇంటిలో నెగిటివ్ అయాన్ల మొత్తాన్ని పెంచాలనుకుంటున్నారా? అనేక ఇన్-హెూమ్ అయానైజర్లు (వాయు శుభ్రకారిణిలు) మార్కెట్లో ఉన్నాయి. కానీ జాగ్రత్త, కొందరు ఓజోన్ వాయువులతో పాటూ అవాంఛనీయ ఫ్రీ-రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. సురక్షిత పరిష్కారం ప్రకృతే : కుండీల్లో మొక్కలు పెంచితే సహజంగా ఆక్సిజన్, నెగిటివ్ అయాన్లను పెంచి కార్బన్ డయాక్సైడ్ ను తగ్గిస్తాయి.

ఇంటి గాలిని మించినా గాలి లేదు … కదా?

సాధారణంగా, బయటి గాలి నాణ్యత మీ ఇంటిలో తిరుగుతున్న గాలి కంటే చాలా మంచిది. వాస్తవానికి, ఒక అధ్యయనం ప్రకారం ఇంట్లో గాలి బయటి గాలి కంటే ఐదు రెట్లు కలుషితమని తెలుస్తోంది. సగటు అమెరికన్లు 90% సమయం ఇంటి లోపల గడుపుతారు కనుక ఇది చెడ్డ వార్తే. నిజమే, ఈ వాయు కాలుష్యం ఎంత ఎక్కువ నిల్వ ఉంటే అంతగా ఇంటిలో గాలినాణ్యతను తీవ్ర ఆరోగ్య సమస్యగా చేస్తోంది.

        ఇంటి వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలలో ఒకటి గాలిలోని చిన్న దూళి కణాలు. అధిక దూళి కణాలు అనేక వైద్య సమస్యలకు కారణమౌతాయి. ఈ సమస్యకు సాధారణ పరిష్కారం కిటికీలు తెరిచి, స్వచ్ఛమైన గాలిని ఇంటి గుండా ప్రసరించనీయడమే. కానీ గుర్తుంచుకోండి అప్పుడప్పుడు గట్టి శ్వాస తీసుకోవడం…….

మరింత చదవాలనుకుంటున్నారా? అమేజింగ్ హెల్త్ మ్యాగజైన్‌ను ఆర్డర్ చేయడానికి మా వనరుల పేజీని సందర్శించండి!