
N.E.W.S.T.A.R.T
విశ్రాంతిని

“అప్పుడు దేవుడైన యెహెూవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను” (ఆదికాండము 2:21, 22).
అద్భుతమైన ఆరోగ్య సత్యము:
కేవలం ఒక గంట నిద్ర లేమి హైవే ప్రమాదాల సంఖ్యను 8% పెంచుతుందని మీకు తెలుసా? అదే సమయంలో ఒక గంట అదనపు నిద్ర వాటిని 8% తగ్గిస్తుందని మీకు తెలుసా? ఇది నిజం! ఏటేట ఇలాగే పొద్దుగ్రుంకు సమయంలో ఇది జరుగుతోంది.
ఎందుకంటే మీరు 18 గంటలు మేల్కొని చేసిన డ్రైవింగ్ రెండు డ్రింకులు (1 డ్రింకు దాదాపు ఒక లీటరు మద్యము) తీసుకున్న తర్వాత డ్రైవింగుతో సమానం. మీరు 24 గంటలు మేల్కొని చేసిన డ్రైవింగ్ ఆరు డ్రింకులు తీసుకున్న డ్రైవింగుతో సమానం! 8 గంటల నిద్ర తర్వాత పూర్తి సామర్థ్యముతో మనం పనిచేయగలుగుతాము.
బైబిల్లో నిద్రను గూర్చిన మొదటి ప్రస్తావన సృష్టితో కూడిన మత్తు నిద్ర అని ఉంది. ఆదాము మేల్కొన్నప్పుడు, అతను ఉత్తేజంతో… ఉజ్జీవంతో… వివాహితుడిగా అవతరించాడు. మొత్తానికి ఓ సరికొత్త జీవితం మొదలైంది. మానవుల భవిష్యత్తు అంతా ఈ మొదటి అంకం నుండే ప్రారంభమైనదనవచ్చు.
వాస్తవం ఏమిటంటే, పాపంలేని ఆ లోకంలో కూడా, ఒక వ్యక్తి విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిద్రించడానికి రాత్రి సరైన సమయం అని దేవుడు నిర్ణయించాడు. “యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు ఒకచోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి, ఆ చోటి రాళ్లలో ఒకటి తీసికొని తనకు తలగడగా చేసికొని, అక్కడ పండుకొనెను” (ఆదికాండము 28:11).
ఈ అసంపూర్ణ, ఉరుకులు పరుగుల ప్రపంచంలో ప్రశాంతమైన విశ్రాంతితో కూడిన నిద్ర ప్రాముఖ్యతను మనకు గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా?
అద్భుతమైన ఆరోగ్య సత్యము: ఒక పసిబిడ్డ రోజుకు 16 గంటలు నిద్రపోతాడు. కానీ అదే శిశువు మొదటి సంవత్సరంలో తల్లిదండ్రులకు 700 గంటల వరకు నిద్ర పోనివ్వడు!
కలత చెందిన నిద్రతో కలత ఏమిటి?
సుమారు 20 కోట్ల మందికి పైగా భారతీయులకు నిద్ర ఇబ్బంది ఉందని అంచనా. ఈ రోజు, కృత్రిమ లైట్లు, టీవీ, ఇంటర్నెట్, కెఫీన్ వ్యామోహం కారణంగా, ప్రజలు తమ ముత్తాతల కంటే ఒక గంట తక్కువ నిద్రపోతున్నారు. ఈ సంఖ్య నిర్ఘాంత పరచకపోవచ్చు – కాని స్వస్థత విషయానికి వస్తే సరైన నిద్ర అనేది చాలా ముఖ్యమైన అంశాలలో ఒకటి. భారతదేశానికి కూడా వ్యాధిపీడిత తత్త్వం నుండి మేల్కొలుపు అవసరం.
నిద్ర ఒక దినచర్య
నిద్ర సమయంలో మీ శరీరం విశ్రాంతి తీసుకోవటానికి మించి చాల పనిచేస్తుంది. మనము విశ్రాంతి తీసుకుంటున్నప్పటికీ, మన శరీరం మరొక రకమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉంటుంది, ఈ ప్రక్రియ అవయవాలు, నరాలు మరియు శరీర కణజాలాలకు ఉద్ధరణ కలుగజేసి నయం చేస్తుంది.
నిద్ర ఐదు క్రమపద్దతుల్లో పెరుగుతూ లోతైన దశలతో నిండి ఉంటుంది. దీన్ని అనుసరిస్తూ మెదడు మరి పదునుగా పనిచేస్తుంది :
1వ దశ : నిద్రమత్తుగా ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా కారును నడిపినట్లయితే, ఈ దశలోని లీలలాంటి నిద్ర మీకు బాగా తెలుసన్నమాట. డ్రైవర్లు తుళ్ళిపడ్డారంటే ఈ దశలోనికి వారు క్లుప్తంగా ప్రవేశించారనే అర్ధం.
2, 3, 4వ దశలు: ఈ దశలలో, మెదడు కార్యకలాపాలు తగ్గుతాయి (కానీ ఆగవు), లోతైన నిద్ర ప్రారంభమవుతుంది. డెల్టా తరంగాలు ప్రారంభమై తీవ్రమవుతాయి.
5వ దశ : ఈ నిద్రలో వేగమైన కంటి కదలిక (REM), కలలు కనడం, కాలుచేతులు కదల్చలేకపోవడం, గుండెదడ, రక్తపోటు లాంటివి కనిపిస్తాయి.
REM సమయంలో బ్రెయిన్ వేవ్ పని విధానం మెలకువ స్థితికి దగ్గరగా ఉంటుంది.
REM దశ సమాచార పరిశీలనకు, జ్ఞాపకాల నిల్వకు, మెదడు సామర్థ్యాన్ని మెరుగుపర్చడానికి ఉపయోగపడే సమయమని ఈ మధ్య కనుగొన్నారు.
నిద్రలో మెలటోనిన్ ఏ పాత్ర పోషిస్తోంది?
మెలటోనిన్ అనేది చీకటిలో పీనియల్ (వినాళ) గ్రంథి ఉత్పత్తి చేసే హార్మోన్, యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాలు ఈ హార్మోన్ ముఖ్య పనుల్లో ఒకటి. ఈ సామర్థ్యాలు కణాల లోపల ప్రమాదకర ఫ్రీరాడికల్స్ నుండి రక్షణను అందిస్తాయి. ఇదిల కణాల అత్యంత ముఖ్య భాగానికి అనగా DNAకి నష్టం జరగకుండా సహాయపడుతుంది. DNAకి జరిగిన నష్టం వల్ల క్యాన్సర్ వంటి అనేక వ్యాధులు సంక్రమిస్తాయి.
అద్భుతమైన ఆరోగ్య సత్యము: అడెనోసిన్ అనే హార్మోన్ మనం నిద్రించడానికి అవసరమైన వెసలుబాటును కలిగిస్తుంది, కాని అడెనోసిన్ కు మెదడుకు మధ్య సంబంధాన్ని అడ్డుకుని మిమ్మల్ని “మేల్కొని” ఉండేలా కెఫైన్ చేస్తుంది. అలసటను లెక్కచేయనీకుండా శరీర రక్షణ ఆపివేస్తుంది.
సంపూర్ణ విశ్రాంతినిచ్చే రాత్రి నిద్రకు సులభమైన ఏడు సాధారణ మెట్లు :
- సూర్యుడితో పాటు నిద్రలేవండి : సూర్యరశ్మి చురుకుదనాన్ని పెంచడానికి సహాయపడి సెరోటోనిన్ వంటి హార్మోన్లను పెంపొందిస్తుంది.
- శాఖాహారంలోని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే సమతుల్య ఆహారం తినండి : ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాలు నిద్రకు మాత్రమే కాక, పగలు మన పనితనాన్ని కూడా చక్కగా నడిపిస్తాయి. సెరోటోనిన్, మెలటోనిన్లతో సహా అనేక హార్మోన్ల నిర్మాణానికి ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆమ్లం అవసరం. ట్రిప్టోఫాన్ మెదడులోకి ప్రవేశించడానికి కార్బోహైడ్రేట్లు సహాయపడతాయి. ట్రిప్టోఫాన్ అధికంగా ఉండే ఆహారాలు: టోఫు, గుమ్మడి గింజలు, మెత్తని పిండి, నువ్వులు, బాదం, నల్ల అక్రోట్లు, నల్ల బఠాణి మొదలగునవి.
- పరిమిత శారీరక వ్యాయామం కోసం సమయాన్ని కేటాయించండి : రాత్రిపూట నిద్రను పెంచడానికి ఉపయోగపడే కొన్ని హార్మోన్ల స్థాయిని పెంచడానికి వ్యాయామం సహాయపడుతుంది.
- నిద్రను దూరంచేసే పదార్థాలను వదిలేయండి (ఆల్కహాల్, కెఫీన్, నికోటిన్, మొదలైనవి) : ఆల్కహాల్ శరీరాన్ని నిద్ర నుండి దూరం చేస్తుంది. కెఫైన్ దాని చురుకెత్తించే లక్షణాల వల్ల నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. నికోటిన్ అలవాటు మానేసిన కారణంగా పొగతాగేవారు రాత్రి సమయంలో గాఢనిద్రను కోల్పోతారు. యాంటిడిప్రెసెంట్స్ నిద్రమాత్రలు కూడా REM నిద్ర స్థాయిలను తగ్గిస్తాయి.
- పెందలకడ నిద్రపోయే క్రమమైన అలవాటును అలవరుచుకోండి : అర్ధరాత్రికి కనీసం రెండున్నర గంటల ముందు నిద్రపోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మీరు పగటిపూట నిద్రపోతున్నా సరిపోదు, క్రమమైన నిద్ర విధానం కూడా ముఖ్యం. రాత్రిళ్ళు పనిచేసేవారు నిద్ర / మేల్కోవడం అనే స్థిర వలయంలో మెరుగ్గా పనిచేస్తారని అధ్యయనాలు చూపుతున్నాయి.
- చీకటిలో నిద్ర : మెలటోనిన్ ను సమర్థవంతంగా వాడుకోవాలంటే, పూర్తిగా రాత్రి………
మరింత చదవాలనుకుంటున్నారా? అమేజింగ్ హెల్త్ మ్యాగజైన్‌ను ఆర్డర్ చేయడానికి మా వనరుల పేజీని సందర్శించండి!