N.E.W.S.T.A.R.T.

సూర్యరశ్మి

ఆదియందు … వెలుగు మంచిదై యుండెను.

“దేవుడు – వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను” (ఆదికాండము 1:3, 4).

అద్భుతమైన ఆరోగ్య సత్యము:

సూర్యుడు బహు భారీ గ్రహం, అతి వేడైన విశ్వవికిరణ శక్తి భాండాగారము. దీని ఉపరితల ఉష్ణోగ్రత 11,000 డిగ్రీల ఫారెన్హీట్. దీని అంతర్గత ఉష్ణోగ్రత ఇంకొంచెం వేడిగా ఉంటుంది- 180 లక్షల డిగ్రీలని అంచనా!

సూర్యుని కేంద్రంలో ఒత్తిడి చదరపు అంగుళానికి 700 మిలియన్ టన్నులు. ఈ శక్తి అణువులను పగులగొట్టడానికీ సూర్యునికేంద్రంలో అణువిలీనాన్ని (న్యూ క్లియర్ ఫ్యూజన్) సృష్టించడానికీ సరిపోతుంది. తద్వారా మనకు చాలినంత కాంతి వెచ్చదనం ఇవ్వగలుగుతుంది. వాస్తవానికి, దానిలో ఉన్నవేడిని ఓ సూదిమొనపై పట్టేంత పట్టుకోగలిగితే, అది ఒక మైలుదూరంలో వ్యక్తిని కూడా చంపేస్తుంది.

అదృష్టవశాత్తూ, 93 మిలియన్ల మైళ్ళ దూరంలో భూమి సురక్షితంగా ఉంది. ఈ సూర్యునికాంతి మనలను చేరుకోవడానికి 8 నిమిషాల 20 సెకన్ల సమయం పడుతుంది. మనకు మేలు చేయడానికి సరిగ్గా సరిపడ సమయంలో అన్నమాట!

సూర్యరశ్మిలో అంత గొప్పేముంది?

కాంతి అన్నిజీవులకు చాలా అవసరం – భూ ప్రాణులన్నీ బతకడానికి కావలసిన శక్తిని సరఫరా చేయడానికి దేవుడు సూర్యుడిని స్థిరమైన వనరుగా అందించాడు. తోటలో మొక్కలు ఉపయోగించే శక్తీ, వేగంగా పరుగెత్తే చిరుత, కారును నడిపే ఇందనం కూడా సూర్యకాంతి సరఫరా చేసిన శక్తేనని గుర్తించొచ్చు. వాస్తవానికి, సౌరశక్తే భూమిపై సహజంగా ఉన్న అన్ని శక్తులకీ మూలం.

ఆదిలో కాంతి మంచిదని దేవుడు చెప్పినప్పటికీ, ఈ రోజుల్లో చాలా మంది ఎండలోకి రారు. బహుశా మనం తప్పుగా అర్ధం చేసుకొని దాని వల్ల అనర్ధమనుకొని అతిగా స్పందించి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోతున్నాము. “వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నుల కింపుగా నున్నది” (ప్రసంగి 11:7).

సూర్యరశ్మి వాస్తవానికి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా?

మొక్కల్లాగే మనిషికి కూడా సరైన ఆరోగ్యానికి సూర్యరశ్మి అవసరం. ఎండ హానికరమని చాలామంది అనుకున్నా, అసలుకి అతిగా ఎండలోనే ఉండడం హానికరం.

వాస్తవానికి, మన శరీరానికి తగినంత సూర్యరశ్మి వల్ల మేళ్ళు ఇవి …

  • ఉద్రిక్తతను తగ్గిస్తుంది.
  • రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • వ్యాధులను నివారిస్తుంది.
  • నిద్రను మెరుగుపరుస్తుంది.
  • మానసిక పనితీరును మెరుగుపరుస్తుంది.
  • జీవక్రియను మెరుగుపరుస్తుంది.
  • కీళ్ళ నొప్పులకు ఉపశమనం ఇస్తుంది.
  • శక్తిస్థాయిలను పెంచుతుంది.

సూర్యరశ్మి వల్ల అనేక ప్రయోజనాలు విటమిన్ “డి”తో ముడిపడి ఉన్నాయి. మన ఆరోగ్యాన్ని ప్రోత్సహించే విటమిన్ “డి”ని సూర్యరశ్మిలోని UVB రేడియేషన్ (B రకం అతినీలలోహిత కిరణాలు) మన శరీరానికి అందిస్తుంది.

అతిగా ఎండకు లోనైనప్పుడు చర్మం దాన్నదే కాపాడుకోడానికి చర్మాన్ని నల్లబర్చే మెలనిన్, విటమిన్ “డి”లను చర్మం ఉత్పత్తి చేస్తుంది. ఈ రెంటి అధిక ఉత్పత్తి వల్ల చర్మం ఎండ మంటను తట్టుకోగలుగుతుంది

నా శరీరానికి ఎంత సూర్యరశ్మి అవసరము?

సాధారణంగా తెల్లగా ఉన్నవారు రోజుకు సుమారు 30 నిమిషాలు, వారానికి 3 సార్లు ఎండలో ఉంటే సరిపోతుంది. మీ చర్మం ఎంత నల్లగా ఉంటే అంత ఎక్కువ ఎండలో మీరు గడిపి తగినంత మొత్తంలో విటమిన్ “డి”ని పొందవచ్చు. అయితే, మీరు తెల్లవారైతే, ఎండను ఎక్కువగా తట్టుకోలేకపోతే, ఎండ తీవ్రత ప్రాంతాల్లో ఉంటుంటే, సూర్యరశ్మిని కొంచెం కొంచెంగా ఎదుర్కొండి. చర్మం ఎర్రబారితే, ఎండలో ఎక్కువ గడిపారని అర్ధం!

రోజుకు ఐదునిమిషాలతో ప్రారంభించి క్రమంగా రోజుకు 30 నిమిషాలు లేదా ఆ పైన ఎండలో ఉండండి. ఎక్కువసేపు ఎండలో ఉండిపోవలసివస్తే, మీ శరీరం (ముఖం, చెవులు, మెడ, భుజాలు, వీపు) ఎక్కువగా కమిలిపోయే ప్రాంతాలను రక్షించే పెద్ద టోపీ, దుస్తులను ధరించడం మర్చిపోవద్దు. అయితే అతినీలలోహిత (యూ.వి) రేడియేషన్ ను తగ్గించే అవరోధాలు (సన్ స్క్రీన్, కిటికీ మొదలైనవి) కూడా మీ శరీరంలో విటమిన్ “డి” ఉత్పత్తిని తగ్గిస్తాయని తెలుసుకోండి!

అద్భుతమైన ఆరోగ్య సత్యములు: 90% భారతీయులకు విటమిన్ “డి” లోపం ఉంది.

మంచిది కదా అని అతిగా చేస్తే

గుర్తుంచుకోండి, సూర్యరశ్మి మితంగా ఉంటేనే మంచిది. మీ చర్మం కమిలిపోయిన ప్రతిసారీ ప్రోటీన్ల జన్యు కణజాలం దెబ్బతిని, చర్మకేన్సర్లోకి దించే ప్రమాదం ఉంది.

ఏదేమైనా, ఇది విని సూర్యరశ్మి అంటే భయపడి దానికి దూరంగా ఉండకండి! శరీరానికి తగినంత విటమిన్ “డి” పొందడానికి వడదెబ్బలో నాలుగో వంతు ఎండ సరిపోతుంది.

చర్మకేన్సర్ వల్ల ఏటా సుమారు 2,000ల మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ, వారు క్రమం తప్పక ఎండలో మితంగా గడిపితే ఇతర రకాల కేన్సర్ మరణాల నుండి ఏడాదికి 1,38,000 మంది తప్పించుకోగలరు.

అద్భుతమైన ఆరోగ్య సత్యములు: 

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ప్రకారం విటమిన్ “డి” తయారవ్వడానికి 10 నుండి 15 నిమిషాల సూర్యరశ్మి సరిపోతుందని నివేదించింది.

మరింత చదవాలనుకుంటున్నారా? అమేజింగ్ హెల్త్ మ్యాగజైన్‌ను ఆర్డర్ చేయడానికి మా వనరుల పేజీని సందర్శించండి!