N.E.W.S.T.A.R.T

దేవుని యందు నమ్మిక

“దేవుడు ఒక్కొక్కనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణప్రకారము” (రోమీయులకు 12:3).

అద్భుతమైన ఆరోగ్య సత్యము: ప్లేసిబో అనేది అచ్చం ఒక చట్టపరమైన ఔషధంలా కనిపిస్తుంది, కాని అది నిజానికి రంగు నీరు లేదా గంజి బిళ్ళ కంటే మరేమీ కాదు. రోగులకు వారి పరిస్థితి మెరుగుపడుతుందనే అంచనాను బలోపేతం చేయడానికి ఈ ప్లాసిబోలు తరచుగా ఇవ్వబడతాయి. కొత్త ఔషధాల సమర్థతను పరీక్షించేటప్పుడు ప్లాసిబోలు కూడా ఉపయోగిస్తారు. తమను నయం చేస్తాయని రోగులు హృదయపూర్వకంగా నమ్మే పదార్థాన్ని తీసుకున్నప్పుడు, వారి లక్షణాలు తరచుగా మెరుగుపడతాయి లేదా పూర్తిగా అదృశ్యమవుతాయని పరిశోధన స్పష్టంగా చూపించింది.

వాస్తవానికి, ఒక అధ్యయనంలో వైద్యులు ఉలిపిరులకు (సురుడుకాయలు) ముదురు రంగు లేదా జుట్టుకు వేసే రంగు కాని పూయడం ద్వారా విజయవంతంగా తొలగించారు. ఈ రంగు పూసినప్పుడు ఉలిపిర్లు పోతాయని రోగులకు వాగ్దానం చేసేవారు. ఉబ్బసం అధ్యయనంలో, పరిశోధకుల వారు శక్తివంతమైన బ్రోంకోడైలేటర్ ను పీల్చుకుంటున్నారని రోగులకు చెప్పడం ద్వారా ఊపిరితిత్తుల మార్గాన్ని విచ్చుకోనేలా చేయగలరని కనుగొన్నారు. ఒక వ్యక్తి నమ్మకాలు నిజమైన శారీరక స్వస్థతకు ఎలా తోడ్పడతాయో వివరించే వేలాది ఇతర రుజువులతో కూడిన ఉదాహరణలు ఉన్నాయి.

విశ్వాసకారకము

ఈ సన్నివేశం యేసు ప్రభువు తానూ స్వస్థపరిచిన వారితో తరచూ ఎందుకు ఇలా చెప్పాడో వివరించడానికి సహాయపడవచ్చు, “నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము” (మార్కు 5:34). నిజమే వైద్యులపై, మందులపై మనకున్న విశ్వాసం మన ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపగలిగితే, మన శారీరక ఆధ్యాత్మిక శ్రేయస్సుకై దేవునిపై పెట్టిన విశ్వాసం ఇంకెంత ఎంత శక్తివంతంగా ఉంటుందో కదా!

యేసు, “(నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని … చెప్పెను” (మార్కు 9:23). ఈ “విశ్వాస బలంపై” అధ్యయనాల గురించిన అసాధారణ విషయం ఏమిటంటే, రోగులు వైద్యులు ఇద్దరూ రోగి బాగుపడతాడని నమ్ముతున్నప్పుడు, చాలా తరచుగా స్వస్థత జరిగింది. ఒక అధ్యయనం ప్రకారం, “జ్ఞానదంతాలు తొలగించినాక రోగులు నొప్పితో బాధపడుతున్నప్పుడు, రోగి, వైద్యులు ఇద్దరూ యంత్రం ఆన్లో ఉందని అనుకున్నంతసేపూ నకిలీ అల్ట్రాసౌండ్ వల్ల కూడా నిజమైన దానికి మల్లే ఉపశమనం లభించింది.” ఒక వ్యక్తి స్వస్థత కోసం చేసే సామూహిక ప్రార్ధన నిజంగానే ఫలితాలను ఇస్తుందనేది బహుశా నిజమేనన్నమాట!

అద్భుతమైన ఆరోగ్య సత్యము: మరో ఏడు సంవత్సరాలు ఎక్కువగా జీవించాలి అనుకుంటున్నారా? రీడర్స్ డైజెస్ట్ పత్రిక 21,000 మందిపై దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనంలో, వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు ప్రార్థనలకు హాజరై మతపరమైన సేవలు చేసేవారు ఇతరులకంటే ఏడు సంవత్సరాలు ఎక్కువ ఆయుర్ధాయం కలిగి ఉంటారని చెప్పింది.

సామాజిక కారకము : ఆరోగ్యముగా ఉండాలనే వ్యక్తులకు ఇతరుల అవసరము ఉన్నది

“మరియు దేవుడైన యెహోవా … నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను” (ఆదికాండము 2:18).

ఆదియందు, దేవుడు మనిషిని ఒక సంఘజీవిగా సృష్టించాడు. ఆరోగ్యమును, నమ్మకమైన సంబంధాలను నమ్మే వారిగా మనలను దేవుడు ముందునుండే తీర్చిదిద్దాడు.

నీవు ఎప్పుడైనా పది ఆజ్ఞలను దగ్గరగా చూశావా? మొదటి నాలుగు దేవునితో మన సంబంధం గూర్చి, మిగిలిన ఆరు తోటి మానవులతో మన నమ్మకమైన సంబంధం గూర్చి మాట్లాడుచున్నాయి. ఈ కారణంగానే యేసు పది ఆజ్ఞలను – దేవుణ్ణి ప్రేమించడం పొరుగువారిని ప్రేమించడం (మత్తయి 22:37-40) – అనే రెండు గొప్ప ఆజ్ఞలుగా సంక్షిప్తము చేసెను.

ఆశ్చర్యకరంగా, ఆధునిక అధ్యయనాల ప్రకారం ప్రజలు ఒకరి నుండి ఒకరు వేరైపోవడమే అనేక ఆరోగ్య సమస్యలకు కారణమని గుర్తించాయి. ఐతే స్వస్థత కొరకు దేవునిలో నమ్మకం అతి ముఖ్యమ్కెనదని మందులు, వైద్యం మరి ఎక్కువగా గుర్తిస్తున్నాయి. అందువల్ల బాధాకరమైన విషయం ఏమంటే విడాకులు, టైర్లను మార్చడమంత సాధారణమైపోయింది. ఒంటరివారు అగ్గిపెట్టెల్లాంటి కాంక్రీట్ గదుల్లో తమను తాము ఖైదు చేసుకోవడం వంటివి ఇప్పుడు ఈ ప్రపంచంలో సాధారణమైపోయింది. మనకు టెలివిజన్ స్థిరమైన తోడుగా మారింది. ఫోనుల్లో చిన్న చిన్న సందేశాలు పొరుగువారితో చక్కని సంభాషణల్ని భర్తీ చేసేసాయి.

అద్భుతమైన ఆరోగ్య సత్యము: 

భారతదేశములో అస్సలు వివాహము చేసుకొననివారు అకాల మరణాలపాలయ్యే ప్రమాదం ఎక్కువని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి అలాగే, విడాకులు తీసుకున్నవారు లేదా విడిపోయినవారు 27 శాతం తొందరగా చనిపోయే అవకాశం ఉంది. అంతేకాక, వివాహితులు ఒంటరి పురుషుల కన్నా 50 శాతం తక్కువ ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. విడాకులు తీసుకున్న పురుషుల కంటే తీసుకోనివారు మూడింట ఒక వంతు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉంది. గమనిస్తున్నారు కదా, మరణాలలో సామాజిక ఒంటరితనం పాత్ర ఎంతైనా ఉంది.

 

ఇటీవల కాలంలో, అనేక సామాజిక శాస్త్రవేత్తలు పతనమైన మానవ సంబంధాల వల్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని గ్రహించారు. ప్రపంచ ప్రఖ్యాత కార్డియాలజిస్ట్, డీన్ ఓర్నిష్, గుండె జబ్బులకు మూల కారణాల గురించి మాట్లాడుతూ :

“మన సంస్కృతిలో నిజమైన అంటువ్యాధి శారీరక గుండె జబ్బులు మాత్రమే కాదు, … ఆధ్యాత్మిక గుండె జబ్బులు కూడా అన్నాడు – అంటే, పూర్వం మన సంస్కృతిలో ఎంతో ప్రబలంగా ఉన్న మానవ సంబంధాల వైఫల్యం వలన మన సాంఘికభావన అనుబంధాలు తొలిగిపోయి ఒంటరితనం, వెలిగావుండడం, వేరేలోకంలో ఉండడం, కృంగుబాటు మరి ఎక్కువైపోయాయి” అన్నాడు.

చర్చిలు, కుటుంబాలు మనల్ని దేవునితోనూ సమాజంతోనూ కలిపి ఉంచే సాంఘిక విధానాలు ఈ రెండూ ఆదికాండంలో ప్రవేశించాయి! దేవునిలో నమ్మకము ఉంచేవారికీ సంఘ సహవాసంలో క్రమంగా ఉండేవారికీ కలిగే మేళ్ళలో బాగా తెలిసినవాటిలో కొన్ని :

 

  • ప్రమాద కారకాలను పక్కన పెట్టిచూసినా కూడా చర్చికి వెళ్ళనివారికన్నా వెళ్లేవారు తక్కువ మరణాల పాలౌతారు.
  • కేన్సర్ కేసుల్లో ఎనిమిదింట ఏడుగురు, రక్తపోటులో ఐదింట నలుగురు, గుండె వ్యాధిలో ఆరింట నలుగురు, సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఐదింట నలుగురిలో తక్కువ రోగ లక్షణాలు, మెరుగ్కెన ఆరోగ్య ఫలితాలు ఉంటాయి…..

మరింత చదవాలనుకుంటున్నారా? అమేజింగ్ హెల్త్ మ్యాగజైన్‌ను ఆర్డర్ చేయడానికి మా వనరుల పేజీని సందర్శించండి!